అమెరికాలో దేవరకొండ వాసి మృతి

by  |
అమెరికాలో దేవరకొండ వాసి మృతి
X

దిశ, దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన అమెరికన్ ఇండియన్ దేవేందర్ రెడ్డి న్యూజెర్సీలోని ఎడిసన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. న్యూజెర్సీలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న దేవేందర్ రెడ్డి మంగళవారం తన పని ముగించుకుని మెయిల్ బాక్స్‌లోని లెటర్స్ తీసుకునేందుకు బయటకు వచ్చాడు. దేవేందర్ తన కారులో కూర్చుని స్టార్ట్ చేయగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవేందర్ మృతిచెందాడు. దేవరకొండ మండలం కర్నాటిపల్లికి చెందిన నర్సిరెడ్డి – భారతమ్మ దంపతులకు దేవేందర్ రెడ్డి రెండో సంతానం. ఆయన కర్నూల్‌లోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తండ్రి నర్సిరెడ్డి దేవరకొండ ఆర్టీసీ డిపోలో కంట్రోలర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. జాబ్ రీత్యా అమెరికాలో స్థిరపడి తన భార్య, ఏడేళ్ల కూతురితో న్యూజెర్సీలో నివాసముంటున్నారు. కాగా కారులోని బ్యాటరీ పేలడంతోనే ఈ ఘటన జరిగిందా లేదా ఇంకేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed