- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్య నేరం
<p>దిశ, భూపాలపల్లి: రేడియోలజిస్ట్, గైనేకాలజిస్ట్ రిఫరెన్స్ లేకుండా స్కానింగ్ లు చేయవద్దని, అవసరమైన గర్భిణీ స్త్రీలకు మాత్రమే స్కానింగ్ చేయాలని డిప్యుటీ డి.ఎం.హెచ్.ఓ. డా.ఎం.కొమురయ్య చెప్పారు. స్కానింగ్ చేసేటప్పుడు గర్భిణి స్త్రీ యొక్క అనుమతి తీసుకోవాలని, అనుమతి ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగ నిర్ధారణ చేయవద్దన్నారు గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షల చట్టం – 1994 (పి.సి.పి.ఎన్.డి.టి.యాక్ట్) ప్రకారం గర్భంలో పెరుగుతున్న పిండం గురించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. గర్భస్రావాలను ఆపాలనే […]</p>

దిశ, భూపాలపల్లి: రేడియోలజిస్ట్, గైనేకాలజిస్ట్ రిఫరెన్స్ లేకుండా స్కానింగ్ లు చేయవద్దని, అవసరమైన గర్భిణీ స్త్రీలకు మాత్రమే స్కానింగ్ చేయాలని డిప్యుటీ డి.ఎం.హెచ్.ఓ. డా.ఎం.కొమురయ్య చెప్పారు. స్కానింగ్ చేసేటప్పుడు గర్భిణి స్త్రీ యొక్క అనుమతి తీసుకోవాలని, అనుమతి ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగ నిర్ధారణ చేయవద్దన్నారు గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షల చట్టం – 1994 (పి.సి.పి.ఎన్.డి.టి.యాక్ట్) ప్రకారం గర్భంలో పెరుగుతున్న పిండం గురించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. గర్భస్రావాలను ఆపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పి.సి.పి.ఎన్.డి.టి.యాక్ట్ ను చట్టం చేసిందని, ఈ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే డాక్టరుకు, చేయిస్తే ఆ కుటుంబ సభ్యులకు మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారని చెప్పారు.
డాక్టర్లు, డయాజ్ఞాస్టిక్ సెంటర్లు నైతిక విలువలు, సామాజిక బాధ్యతతో పాటు చట్టాన్ని గౌరవించాలని డిప్యూటి డిఎం.హెచ్.ఓ. డా.ఎం.కొమురయ్య తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని నర్సింగ్ హోమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణి స్త్రీలు టెన్షన్ పడవద్దని, ఆరోగ్యం పట్ల, తీసుకోవాల్సిన మందులు, ఆహారం, విశ్రాంతి గురించి డాక్టర్లు మంచి సలహాలు ఇవ్వాలన్నారు.
- Tags
- komurayya






