మహిళా సర్పంచ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉప సర్పంచ్

by Shyam |   (  Updated:2021-08-06 21:55:27  IST  )

<p>దిశ, భువనగిరి రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అర్రూర్ గ్రామ పంచాయతీ అవరణలో, ఉప సర్పంచ్ సుక ముత్యాలు తనను కులం పేరుతో దూషించాడని స్థానికుడు సలబద్రి నర్సింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. అర్రూర్ గ్రామంలో గ్రామ సభ జరుగుతున్న సమయంలో, గ్రామ ఉప సర్పంచ్ సుక ముత్యాలు గ్రామ సర్పంచ్ చిటెడ్డి జయమ్మ జనార్ధన్ రెడ్డిని ఉద్దేశించి, గ్రామంలో లైట్ల ఏర్పాటు విషయంలో గొడవ పడ్డాడు. ఈ [&hellip;]</p>

deputy sarpanch
X

దిశ, భువనగిరి రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అర్రూర్ గ్రామ పంచాయతీ అవరణలో, ఉప సర్పంచ్ సుక ముత్యాలు తనను కులం పేరుతో దూషించాడని స్థానికుడు సలబద్రి నర్సింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. అర్రూర్ గ్రామంలో గ్రామ సభ జరుగుతున్న సమయంలో, గ్రామ ఉప సర్పంచ్ సుక ముత్యాలు గ్రామ సర్పంచ్ చిటెడ్డి జయమ్మ జనార్ధన్ రెడ్డిని ఉద్దేశించి, గ్రామంలో లైట్ల ఏర్పాటు విషయంలో గొడవ పడ్డాడు.

ఈ నేపథ్యంలో అసభ్య పదజాలంతో మహిళా సర్పంచ్‌ను దూషించడంతో తాను కల్పించుకొని మహిళా సర్పంచ్ ను అలా మాట్లాడడం సభ్యత కాదని వారించానని నర్సింహ తెలిపారు. అంతేకాకుండా గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి సారి నువ్వే అడ్డుపడుతున్నావు అని అన్నందుకు ఉప సర్పంచ్ సుక ముత్యాలు అతని అనుచరులు మూకుమ్మడిగా తనపై దాడి చేసి కులం పేరుతో దుర్భషలాడారని ఆరోపించారు. ఇంకోసారి మాట్లాడితే నీ అంతు చూస్తాను అంటూ బెదిరించారని, తనకు వారి వలన ప్రాణ భయం ఉన్నది అని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ కు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపాడు.

Next Story