- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టెప్పులేసిన ఏపీ డిప్యూటీ సీఎం.. డప్పుకొట్టిన ఎమ్మెల్యే
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘనంగా జరిగాయి. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హోదాలో ఈ వేడుకలకు హాజరైన ఆమె ఆదివాసీలతో కలిసి స్టెప్పులేశారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నృత్యాలు చేస్తూ అందర్నీ ఉత్సాహపరిచారు. గిరిజనులతో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ భావన సైతం […]</p>

దిశ, ఏపీ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘనంగా జరిగాయి. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హోదాలో ఈ వేడుకలకు హాజరైన ఆమె ఆదివాసీలతో కలిసి స్టెప్పులేశారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నృత్యాలు చేస్తూ అందర్నీ ఉత్సాహపరిచారు. గిరిజనులతో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ భావన సైతం థింసా నృత్యం చేశారు. మరోవైపు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు డప్పుకొడుతూ ఎంజాయ్ చేశారు. మెుత్తానికి ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఓ రేంజ్‌లో అదిరిపోయాయి. అంతకుముందు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన మాత విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ వేడుకల్లో ఐటీడీఏ అధికారులు, గిరిజన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






