- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్షన్.. టెన్షన్.. డెంగీ కొత్త రకం వచ్చిందా?
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాధిలో కొత్త రకం వచ్చిందేమోనని అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెరగడానికి కారణాలేమిటీ? అనే విషయాలను తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే డెంగీ వ్యాధితో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కేసులను పరిశీలిస్తున్నారు. ఫీవర్, నిలోఫర్ ఆసుపత్రుల సందర్శన అనంతరం అక్కడ విషమ స్థాయిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక వారి రక్తనమునాలను జీనోమ్ సీక్వెన్సీకి పంపించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూత్రపాయంగా నిర్ణయించారు. ఇప్పటికే […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాధిలో కొత్త రకం వచ్చిందేమోనని అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెరగడానికి కారణాలేమిటీ? అనే విషయాలను తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే డెంగీ వ్యాధితో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కేసులను పరిశీలిస్తున్నారు. ఫీవర్, నిలోఫర్ ఆసుపత్రుల సందర్శన అనంతరం అక్కడ విషమ స్థాయిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక వారి రక్తనమునాలను జీనోమ్ సీక్వెన్సీకి పంపించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూత్రపాయంగా నిర్ణయించారు.
ఇప్పటికే క్రిటికల్ స్టేజ్ లో ఉన్న రోగుల వివరాలను ఆయా ఆసుపత్రుల అధికారులు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో డెంగీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2019లో సుమారు 13 వేలకు పైగా కేసులు తేలినట్టు అధికారిక లెక్కలు చెబుతుండగా.. ఈ ఏడాది ఇప్పటికే 4 వేల కేసులు దాటిపోయాయి. దీంతో ప్రజలతో పాటు అధికారులు టెన్షన్ కు గురవుతున్నారు.






