గర్జించిన గబ్బర్.. CSK చిత్తు చిత్తు

by  |
గర్జించిన గబ్బర్.. CSK చిత్తు చిత్తు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 34వ మ్యాచ్‌లో 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన పోరులో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి ఓవర్‌లో జడేజా సిక్సర్లు సమర్పించుకోవడంతో సీఎస్కే చిత్తుగా ఓడింది.

ముఖ్యంగా శిఖర్ ధావన్ (101*)ఢిల్లీ విజయంలో కీలక పాత్ర వహించాడు. మెరుపు సెంచరీతో మంచి ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. గబ్బర్‌కు తోడు అక్సర్ పటేల్(21*) చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఒక బంతి మిగిలి ఉండగానే ఢిల్లీ విజయం లాంఛనమైంది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి చివరి బంతి సిక్స్ కొట్టి 185/5 ఓవర్ స్కోర్ చేసి ఢిల్లీ విక్టరీ కొట్టింది.

గబ్బర్ మెరుపు సెంచరీ…

ఐపీఎల్ 34వ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ చెలరేగిపోయాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీలు బాదాడు. కేవలం 57 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 58 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి నుంచి సమిష్టిగా రాణిస్తూ జట్టును విజయం తీరాలకు చేర్చాడు.

చెన్నై ఇన్నింగ్స్:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత తడబడ్డా చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఇందులో చివరి రెండు ఓవర్లలోనే 32 పరుగులు రావడం గమనార్హం. తొలుత ఓపెనింగ్ వచ్చిన శామ్‌ కుర్రాన్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో సీఎస్కే కాస్త నిరుత్సాహానికి గురైంది. ఇక మరో ఓపెనర్ ఫాఫ్ డూ ప్లెసిస్, వన్ డౌన్ ప్లేయర్ షేన్ వాట్సన్ కాసేపు క్రీజులో కుదురుకున్నారు. ముఖ్యంగా డుప్లెసిస్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. షేన్ వాట్సన్ (36) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డుప్లెసిస్ కూడా రబాడా వేసిన బంతికి షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 109 పరుగులకు సీఎస్కే టాప్‌ ఆర్డన్‌ను కోల్పోయింది.

వారిద్దరి మెరుపు ఇన్నింగ్స్:

ఇక మిడిలార్డర్‌లో అంబటి రాయుడు కుదురుకున్నా.. ధోని మాత్రం 129 పరుగుల వద్ద కేవలం 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన జడేజా… అంబటి రాయుడికి మంచి భాగస్వామ్యం ఇచ్చాడు. అంబటి రాయుడు 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు కొట్టి 45 పరుగులు చేయగా.. జడేజా 13 బంతుల్లోనే 4 సిక్సర్లు కొట్టి 33 రన్స్ తీశాడు. వీరిద్దరు చివరి వరకు నాటౌట్‌గా నిలవడంతో చెన్నై స్కోరు 179కు చేరింది.

స్కోరుబోర్డు:

Chennai Super Kings Innings 179-4 (20 Ov)

1. శామ్ కుర్రాన్ c నోర్ట్జే b తుషార్ దేశ్ పాండే 0(3)
2. ఫాఫ్ డు ప్లెసిస్ c దావన్ b రబాడా 58(47)
3. షేన్ వాట్సన్ b నోర్ట్జే 36(28)
4. అంబటి రాయుడు నాటౌట్ 45(25)
5. ఎంస్ ధోని (c) (wk)c అలెక్స్ కారీ b నోర్ట్జే 3(5)
6. రవీంద్ర జడేజా నాటౌట్ 33(13)

ఎక్స్‌ట్రాలు: 4

మొత్తం స్కోరు: 179/4

వికెట్ల పతనం: 0-1 (శామ్ కుర్రాన్, 0.3), 87-2 (షేన్ వాట్సన్, 11.4), 109-3 (ఫాఫ్ డు ప్లెసిస్, 14.4), 129-4 (ఎంస్ ధోని, 16.3)

బౌలింగ్:

1. తుషార్ దేశ్‌పాండే 4-0-39-1
2. కగిసో రబాడా 4-1-33-1
3. అక్సర్ పటేల్ 4-0-23-0
4. ఎన్రిచ్ నోర్ట్జే 4-0-44-2
5. రవిచంద్ర అశ్విన్ 3-0-30-0
6. మార్క్యుస్ స్టోయినిస్ 1-0-10-0

Delhi Capitals Innings:
1. పృథ్వీ షా c and b దీపక్ చాహర్ 0(2)
2. శిఖర్ ధావన్ నాటౌట్ 101(58)
3. అజింక్య రహనే c శామ్ కుర్రాన్ b దీపక్ చాహర్ 8(10)
4. శ్రేయాస్ అయ్యర్ (c)c డు ప్లెసిస్ b డీజే బ్రావో 23(23)
5. మార్క్యుస్ స్టోయినిస్ c రాయుడు b ఠాకూర్ 24(14)
6.అలెక్స్ కారీ c డు ప్లెసిస్ b శామ్ కుర్రాన్ 4(7)
7.అక్సర్ పటేల్ నాటౌట్ 21(5)

ఎక్స్‌ట్రాలు: 4

మొత్తం స్కోరు: 185/5

వికెట్ల పతనం: 0-1 (పృథ్వీ షా, 0.2), 26-2 (అజింక్య రహనే, 4.1), 94-3 ( శ్రేయాస్ అయ్యర్, 11.3), 137-4 (మార్క్యుస్ స్టోయినిస్ , 15.4) 159-5 (అలెక్స్ కారీ, 18.1)

బౌలింగ్:

1. దీపక్ చాహర్ 4-1-18-2
2. శామ్ కుర్రాన్ 4-0-31-1
3. శార్దుల్ ఠాకూర్ 4-0-39-1
4. రవీంద్ర జడేజా 1.5-0-35-0
5. కర్ణ్ వర్మ 3-0-34-0
6. డ్వెయిన్ బ్రాబో 3-0-23-1


Next Story

Most Viewed