ఢిల్లీ స్కోరు 161/7

5

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పర్వాలేదనిపించింది. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పృథ్వీ షా(0) డకౌట్ అయినా.. శిఖర్ ధావన్(57), శ్రేయాస్ అయ్యర్(53) హాఫ్ సెంచరీలు చేసి జట్టు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరు పెవిలియన్ చేరిన తర్వాత అజింక్య రహనే(2), మార్క్యుస్ స్టోయినిస్(18), అలెక్స్ కారీ(14), అక్సర్ పటేల్(7) పరుగులు చేసి ఔట్ అయ్యారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 161 పరుగులు మాత్రమే చేసింది.