డిగ్రీ, పీజీ పరీక్షలపై హైకోర్టులో విచారణ..!

by  |
డిగ్రీ, పీజీ పరీక్షలపై హైకోర్టులో విచారణ..!
X

దిశ, వెబ్‎డెస్క్: డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఆన్‎లైన్‎లో నిర్వహించాలని దాఖలు చేసిన పిటిషన్‎పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆన్‌లైన్‌లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలుకాదని, గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సమస్య తలెత్తె అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కరోనా కారణంగా పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చని పేర్కొంది. సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులర్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది.

అయితే అటానమస్‌ కాలేజీలకు మాత్రమే ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు అనుమతిచ్చామని, క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో మాత్రమే ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఓయూ కోర్టు తెలిపింది. మరోవైపు ఆన్‌లైన్‌లో మిడ్‌టర్మ్‌, ఆఫ్‌లైన్‌లో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తామని జేఎన్టీయూ పేర్కొంది. దీంతో ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోందని.. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ఏదో ఒక విధానం ఉండాలని హైకోర్టు సూచించింది.

Read Also…

ముగిసిన ఎంసెట్ పరీక్ష


Next Story