హాలీవుడ్ క్రాస్ కల్చరల్ రొమాంటిక్‌ మూవీలో దీపిక

by  |
హాలీవుడ్ క్రాస్ కల్చరల్ రొమాంటిక్‌ మూవీలో దీపిక
X

దిశ, సినిమా : బాలీవుడ్ దివా దీపికా పదుకొనే మళ్లీ హాలీవుడ్ బాట పట్టనుంది. నాలుగున్నరేళ్ల కిందట విన్ డీజిల్‌‌తో కలిసి XXX సినిమాలో నటించిన దీపిక.. తాజాగా తన సెకండ్ హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. ఎరోస్ STX గ్లోబల్ కార్పొరేషన్స్ డివిజన్ STX ఫిల్మ్స్ డెవలప్ చేసిన క్రాస్ కల్చరల్ రొమాంటిక్ కామెడీ మూవీకి ఓకే చెప్పింది. అయితే దీపిక ఈ ప్రాజెక్ట్‌లో నటించడమే కాకుండా తన Ka ప్రొడక్షన్స్‌పై కో ప్రొడ్యూస్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో ‘గ్లోబల్ అప్పీల్‌తో కూడిన పర్పస్‌ఫుల్ కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో Ka ప్రొడక్షన్స్ స్థాపించబడింది. ఈ క్రమంలో ప్రభావవంతమైన, డైనమిక్ క్రాస్-కల్చరల్ స్టోరీస్‌ను ప్రపంచానికి అందించేందుకు ప్రయత్నిస్తున్న STX ఫిల్మ్స్, టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్‌తో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొంది. కాగా దీపిక గతేడాది ‘చపాక్’ చిత్రంతోనే ప్రొడ్యూసర్‌గా మారిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed