కరోనాతో ఆస్పత్రిలో చేరిన దీపిక తండ్రి..

49

దిశ, సినిమా : బాలీవుడ్ దివా దీపికా పదుకొనే తండ్రి ప్రకాశ్ పదుకొనే హాస్పిటలైజ్ అయ్యారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనతో పాటు భార్య ఉజ్జల, చిన్న కూతురు అనీషాకు కూడా పాజిటివ్ వచ్చినట్లు సన్నిహితులు తెలిపారు. వీరికి పాజిటివ్ వచ్చి వన్ వీక్ కాగా ఐసోలేషన్‌లో ఉన్నారని, హై ఫీవర్ అండ్ సింప్టమ్స్‌తో ప్రకాశ్ పదుకొనే ఆస్పత్రిలో చేరారని వివరించారు. ప్రస్తుతం తన హెల్త్ కండిషన్ బాగుందని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని వివరించారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..