నటి దీపిక పదుకొనేకు కరోనా పాజిటివ్

34

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే, దీపికకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు దీపిక కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారంతా బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..