ప్రభాస్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న దీపిక.. కారణం?

by  |
ప్రభాస్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న దీపిక.. కారణం?
X

దిశ, సినిమా : బాలీవుడ్ దివా దీపికా పదుకొనే – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ నిర్మిస్తుండగా.. జులైలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఆలోపు ‘పఠాన్’ షూటింగ్ ముగించుకోనున్న భామ.. ఆ తర్వాత 75 రోజుల పాటు ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం పనిచేయనుందని సమాచారం. యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో డిఫర్ గెటప్‌లో కనిపించనున్న ఆమె.. ఫ్యూచరిస్టిక్ టైమ్‌లైన్‌లో మనుగడ కోసం పోరాడే పాత్రతో ఆకట్టుకోనుందని తెలుస్తోంది. ఇలాంటి స్టోరీ లైన్‌ను ఇండియన్ సినిమా ఇప్పటి వరకు టచ్ చేయలేదని తెలుస్తుండగా.. దర్శకులు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్‌లు 2023లో చిత్రాన్ని రిలీజ్ చేసే చాన్స్ ఉంది. పలు ఇంటర్నేషనల్ టీమ్స్ ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం పనిచేయనుండగా.. 2022లో రిలీజ్ సాధ్యం కాదనే చెప్తున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.



Next Story

Most Viewed