అప్పుల బాధ తాళలేక ఆ వ్యక్తి ఏం చేశాడంటే..?

by Nalla Sampath Reddy |   (  Updated:2021-06-14 06:42:29  IST  )

<p>దిశ, జవహర్ నగర్: మేడ్చల్ లో విషాదం చోటుచేసుకొంది. తాగుడుకు బానిసై కుటుంబాన్ని పోషించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కార్పొరేషన్ పరిధిలోని బిజెఆర్ నగర్ కు చెందిన రామోజీ శ్రీనివాస్ (37) అనే వ్యక్తి  బోర్ వెల్ మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతకొంతకాలంగా శ్రీనివాస్ మద్యానికి బానిసై, పనులకు వెళ్లకుండా అప్పులపాలయ్యాడు. [&hellip;]</p>

man suicide news
X

దిశ, జవహర్ నగర్: మేడ్చల్ లో విషాదం చోటుచేసుకొంది. తాగుడుకు బానిసై కుటుంబాన్ని పోషించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కార్పొరేషన్ పరిధిలోని బిజెఆర్ నగర్ కు చెందిన రామోజీ శ్రీనివాస్ (37) అనే వ్యక్తి బోర్ వెల్ మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతకొంతకాలంగా శ్రీనివాస్ మద్యానికి బానిసై, పనులకు వెళ్లకుండా అప్పులపాలయ్యాడు. ఈ విషయమై భార్య లతతో ఎప్పుడు గొడవపడుతుండేవాడు. ఈ నేపధ్యంలోనే ఈ నెల 10న పిల్లలను వెంటబెట్టుకుని భార్య ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాస్ ఆదివారం చీరతో రేకుల రాడ్డుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంతసేపటికి తలుపు తెరవకపోవడంతో అనుమానమొచ్చింది స్థానికులు తలుపు తీసి చూడగా రేకుల రాడ్డుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే శ్రీనివాస్ ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story