నీ కూతురిని రేప్ చేస్తాం.. విరాట్ కోహ్లీకి బెదిరింపులు (వైరల్)

by  |
నీ కూతురిని రేప్ చేస్తాం.. విరాట్ కోహ్లీకి బెదిరింపులు (వైరల్)
X

దిశ, వె‌బ్‌డెస్క్ : టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వెల్లువెత్తుతున్నాయి. ‘నీ తొమ్మిది నెలల కూతురిని రేప్ చేస్తామని’ కొందరు ఫ్యాన్స్ ముసుగులో ఉన్న దుండగులు కామెంట్స్ చేయడంపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. దీనిని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయడమే గాక విచారణ చేపట్టింది. ఎఫ్‌ఐఆర్ కాపీ, నిందితులను గుర్తించి అరెస్టు చేయడంతో పాటు వారి వివరాలను ఈనెల 8లోపు అందజేయాలని డీసీడబ్ల్యూ డిప్యూటీ పోలీసు కమిషనర్‌ను కోరింది.

అయితే, టీ20 వరల్డ్ కప్‌ 2021లో భాగంగా భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 24న జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచులో టీం ఇండియా పాక్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఐసీసీ నిర్వహించిన వరల్డ్ కప్ టోర్నీల్లో ఇప్పటివరకు పాకిస్థాన్ జట్టు భారత్‌ పై గెలవలేదు. తొలిసారిగా కోహ్లీ కెప్టెన్సీలో పాక్ చేతిలో భారత్ ఓడిపోవడాన్ని కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ రోజు మ్యాచ్ ఓడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. కొందరు జట్టు కూర్పుపై బీసీసీఐను సోషల్ మీడియా వేదికగా నిలదీయగా, మరికొందరు ఆటగాళ్ల తీరును విమర్శించారు. కానీ ఫ్యాన్స్ ముసుగులో ఉన్న కొందరు దుండగులు ఇలా కోహ్లీ తొమ్మిది నెలల కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరింపులకు గురిచేయడంపై డీసీడబ్ల్యూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా విచారణకు ఆదేశించింది.


Next Story

Most Viewed