- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది ఇవ్వలేదని నిద్రిస్తున్న అత్తను కోడలు ఏం చేసిందంటే
<p>దిశ,వెబ్‌డెస్క్ : ఎక్కడైనా అత్తకు, కోడలికి మధ్య గొడవలు ఉండటం సహజం. కానీ ఎక్కడైనా అత్తాకోడళ్లు గొడవలు పెట్టుకుంటారు, మరీ ఎక్కువైతే కొట్టు కుంటారు. కానీ అత్తపై కోపంతో కోడలు చేసిన పనిచూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. వైయస్సార్ జగన్ చేయూత డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో అత్తపై కోడలు హత్యాయత్నం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని గుడవాడ మండలం మందపాడులో లక్ష్మి , స్వరూప అనే ఇద్దరు అత్తాకోడళ్లు […]</p>

దిశ,వెబ్‌డెస్క్ : ఎక్కడైనా అత్తకు, కోడలికి మధ్య గొడవలు ఉండటం సహజం. కానీ ఎక్కడైనా అత్తాకోడళ్లు గొడవలు పెట్టుకుంటారు, మరీ ఎక్కువైతే కొట్టు కుంటారు. కానీ అత్తపై కోపంతో కోడలు చేసిన పనిచూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. వైయస్సార్ జగన్ చేయూత డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో అత్తపై కోడలు హత్యాయత్నం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. జిల్లాలోని గుడవాడ మండలం మందపాడులో లక్ష్మి , స్వరూప అనే ఇద్దరు అత్తాకోడళ్లు నిసిస్తున్నారు. చాలా రోజుల నుంచే వారికి ఒకరంటే ఒకరికి పడదు. ఈ క్రమంలోనే శనివారం అవసరాల నిమిత్తం అత్తను వైయస్సార్ జగన్ చేయూత డబ్బులు ఇవ్వమని కోడలు అడిగింది. దానికి అత్త కుదరదు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడంతో ఆగ్రహానికిలోనైన కోడలు నిద్రిస్తున్న అత్తపై వేడి వేడిగా మసిలే నూనె పోసింది. దీంతో అత్త లక్ష్మికి తీవ్రగాయ్యాయి. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు గుడివాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కోడలు, కొడుకును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.






