- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నకిలీల దోపిడీని అరికట్టాలి: బీసీ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేశ్
దిశ, తెలంగాణ బ్యూరో: మార్కెట్లో నకిలీ వస్త్రాల దోపిడీని అరికట్టాలని బీసీ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ డిమాండ్ చేశారు. హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ ధరలంటూ చేనేత ముసుగులో పవర్ లూమ్ వస్త్రాల అమ్మకం కొనసాగుతుందని, దీనిని అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నకిలీల అమ్మకాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పండుగల వేళ భారీ ప్రమోషన్లతో , సినీ నటులతో విచ్చలవిడిగా హంగామా చేస్తున్నారని ఆరోపించారు. సంపద సృష్టించేది కులవృత్తి దారులైతే.. దాని ఫలాలు అనుభవించేది అగ్రవర్ణాలు అని మండిపడ్డారు.
1985 హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్టు ప్రకారం 11 రకాల చేనేత వస్త్రాలకు ఉన్న రిజర్వేషన్ ను పవర్ లూమ్ పై కాపీ చేయడానికి వీల్లేదని, దీనికి చట్టబద్ధత ఉందన్నారు. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏడీ సాయంతో పరిశీలన అనంతరం క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చన్నారు. నకిలీ చేనేత వస్త్రాలు అమ్మినా , షాప్ లో లేదా గోడౌన్ లలో కలిగి ఉన్నా భారీ జరిమానాతో వెంటనే దుకాణం సీజ్, ఆరేళ్ల కఠిన కారాగారం శిక్ష కూడా ఉంటుందన్నారు. నటించిన నటులపై చీటింగ్ కేసులు నమోదు చేయవచ్చన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని, నకిలీ వస్త్రాల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ కొలను నిర్మల, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ బొమ్మ నరేందర్, తదితరులు పాల్గొన్నారు
- Tags
- BC
- dasu suresh