ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. జాగ్రత్త

453

 దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం కాగానే అందరికి ముందు గుర్తు వచ్చేది టీ.. చాలా మందికి ఉదయాన్నే టీ తాగకపోతే ఆ రోజు అసలు బుర్రే పనిచేయదు. మరికొంతమందైతే ఉదయాన్నే టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిదేనా.. ? ఖాళీ కడుపుతో టీ తాగడం వలన కలిగే అనర్ధాల గరించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన యాసిడ్ లెవెల్స్ మరింత పెరిగిపోతాయి. దీనితో ఐరన్ లోపం కలిగి ఎనీమియా సమస్య వస్తుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడే వాళ్ళు ఉదయాన్నే టీ తాగడం మంచిది కాదు. ఉదయాన్నే టీ తాగడం వలన టీ లో ఉండే కెమికల్ కారణంగా నెగిటివ్ ప్రభావం కలుగుతుంది. ఇది కాన్స్టిపేషన్ సమస్యకు దారితీస్తుంది. అలానే టీ లో వుండే నికోటిన్ మిమ్మల్ని టీ కి బానిస చేస్తుంది.అలానే వికారం, అలసట మొదలైన సమస్యలు కూడా వస్తాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..