హీరోగా ఎంట్రీ ఇస్తున్న సీనియర్ యాక్టర్ వారసుడు

by  |
daksha
X

దిశ, సినిమా : సీనియర్ యాక్టర్ శరత్ బాబు వారసుడు ఆయుష్ ‘దక్ష’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రాన్ని వివేకానంద విక్రాంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ లోగోను తాజాగా సీనియర్ నటులు తనికెళ్ల భరణి, శరత్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన భరణి.. ‘దక్ష’ అంటే అన్ని వ్యవహారాలను సమన్వయం చేసేవాడని, ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా పనిచేసిన తల్లాడ సాయి కృష్ణకు ఆ పేరు చక్కగా సరిపోతుందని అన్నారు.

శరత్ బాబు మాట్లాడుతూ.. ‘ఆయుష్ నా తమ్ముడి కొడుకు, నా కొడుకు కూడా. తను హీరోగా నటిస్తున్న చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. కాగా త్వరలోనే విడుదల కానున్న తమ చిన్న సినిమాకు మీడియా సపోర్ట్ కావాలని నిర్మాతలు కోరారు. హీరోయిన్స్ అను మరియు నక్షత్ర ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. అను, నక్షత్ర ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తున్న సినిమాకు కథ, మాటలు ‘శివ కాకు’ అందించగా.. రామ్ తవ్వ స్వరాలు సమకూర్చారు.

Next Story

Most Viewed