ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’.. నటుడిగా నవీన్‌ పొలిశెట్టి

by  |

దిశ, వెబ్‌డెస్క్: సినీరంగంలో గౌరవప్రద పురస్కారమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డ్స్‌కు సంబంధించి 2020 సౌత్ జాబితాను తాజాగా ప్రకటించారు. తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’ ఎంపిక కాగా.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో నటనకు గాను నవీన్ పొలిశెట్టి బెస్ట్ యాక్టర్‌గా సెలెక్ట్ అయ్యాడు. ఇక ‘డియర్ కామ్రేడ్‌’లో లిల్లీగా ప్రేక్షకులను మెప్పించిన రష్మిక మందన బెస్ట్ యాక్ట్రెస్‌గా సెలెక్ట్ కాగా, ఉత్తమ దర్శకుడిగా సుజిత్(సాహో), ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్. థమన్ అవార్డు అందుకోనున్నారు. ఇక మోస్ట్ వర్సటైల్ యాక్టర్‌గా కింగ్ నాగార్జున దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు.

Next Story

Most Viewed