వివాదంలో ‘సార్పట్ట’.. మూవీ యూనిట్‌కు మాజీ మంత్రి నోటీసులు

by  |
Sarpatta
X

దిశ, సినిమా: ఆర్య – పా రంజిత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సార్పట్ట’ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి. జయకుమార్ మూవీ యూనిట్‌కు నోటీసులు పంపించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఈ మూవీలో ఎంజీఆర్‌ను తప్పుగా చూపించారని ఆరోపించాడు. ఎంజీఆర్ నిజమైన క్రీడాకారుడన్న ఆయన.. మహ్మద్ అలీ వంటి బాక్సర్లను ప్రోత్సహించింది ఆయనే అని తెలిపారు. సీనియర్ నటులు సత్యరాజ్ లాంటి వారికి ఫిట్‌నెస్ సీక్రెట్స్ కూడా నేర్పించారని, అలాంటి వ్యక్తి గురించి పూర్తి వ్యతిరేకంగా చూపించారని ఫైర్ అయ్యాడు. అయితే సినిమా విడుదలయ్యాక ఇన్ని రోజులకు వివాదానికి తెరతీయడంపై సినీ వర్గాలు మండిపడుతున్నాయి. నిజానికి డి. జయకుమార్ రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed