- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెన్షన్ టెన్షన్.. డీ ఫ్లోరైడ్ కట్ట తెగితే మిగిలేవి కన్నీళ్లే..
<p>దిశ, ఖానాపూర్ : రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ సమీపంలో గల డీ ఫ్లోరైడ్ రిజర్వాయర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. పరిమితికి మించి వరద నీరు చేరటంతో రిజర్వాయర్ చుట్టూ ఉన్న కట్ట తెగే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే వరద నీటి ప్రవాహం వలన దిగువనున్న అశోకనగర్, అయోధ్య నగర్ గ్రామాలకు ప్రమాదం పొంచి […]</p>

దిశ, ఖానాపూర్ : రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ సమీపంలో గల డీ ఫ్లోరైడ్ రిజర్వాయర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. పరిమితికి మించి వరద నీరు చేరటంతో రిజర్వాయర్ చుట్టూ ఉన్న కట్ట తెగే అవకాశం ఉంది.
ఒకవేళ అదే జరిగితే వరద నీటి ప్రవాహం వలన దిగువనున్న అశోకనగర్, అయోధ్య నగర్ గ్రామాలకు ప్రమాదం పొంచి ఉన్నది. కట్ట తెగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి నీటిని మళ్లీస్తే వరద ప్రవాహానికి గురికాకుండా ఉంటామని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
ఎమ్మెల్యే రాక :
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డీ ఫ్లోరైడ్ రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.






