- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేటర్ ఎన్నికలకు భారీ బందోబస్తు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల బందోబస్తుపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 19 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి, ఇప్పటికే 2,569 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అంతేగాకుండా సైబరాబాద్ సీపీ పరిధిలో 770 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్టు తెలిపారు. ప్రతి జీహెచ్ఎంసీ సర్కిల్‌కి ఒక ఏసీపీ స్థాయి అధికారిని నియమించామని అన్నారు. మొత్తం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల బందోబస్తుపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 19 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి, ఇప్పటికే 2,569 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అంతేగాకుండా సైబరాబాద్ సీపీ పరిధిలో 770 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్టు తెలిపారు. ప్రతి జీహెచ్ఎంసీ సర్కిల్‌కి ఒక ఏసీపీ స్థాయి అధికారిని నియమించామని అన్నారు. మొత్తం ఎన్నికలకు సంబంధించి, 13,500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అంతేగాకుండా ఇప్పటివరకూ 186 మందిని బైండోవర్ చేశామని అన్నారు.
Next Story






