డేటింగ్ యాప్‌లతో హనీ ట్రాప్ : సజ్జనార్

by  |
డేటింగ్ యాప్‌లతో హనీ ట్రాప్ : సజ్జనార్
X

దిశ, క్రైమ్ బ్యూరో: డేటింగ్ యాప్ వినియోగిస్తున్న మహిళలను హనీ ట్రాప్ చేస్తూ సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. లాక్‌డౌన్ పీరియడ్‌ నుంచి ఈ తరహా కేసులు అధికంగా నమోదవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. హనీట్రాప్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ప్రాంతాల నుంచి గ్యాంగ్ స్టర్‌లు అమాయకులను మోసం చేయడానికి హనీ ట్రాప్ పేరుతో కొత్త మార్గంలో ముందుకొస్తున్నట్టు గుర్తించారు. వివిధ డేటింగ్ యాప్‌లు వినియోగించే మహిళల ఫోన్ నెంబర్లను సేకరించి, వారికి నేరుగా వాట్సాప్ కాల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వారు నగ్నంగా వీడియో(వాట్సాప్) కాల్ చేయడంతో బాధితులను ఆకర్షిస్తున్నారు. మోసగాళ్లు చేసే నగ్న వీడియోలకు ఆకర్షితులయిన వారిని నగ్నంగా వీడియో కాల్ చేయాలని కోరడంతో.. బాధితులు చేస్తున్న నగ్న వీడియో కాల్స్‌ను మోసగాల్లు రికార్డు చేస్తున్నారు.

అనంతరం ఆ వీడియోలు చూపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి పలు ఫిర్యాదులు అందాయి. సదరు మహిళలు డబ్బులు చెల్లించలేనియెడల సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలియని నెంబరు నుంచి వచ్చే వీడియో కాల్స్‌ను అటెండ్ చేసి, మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ఆన్ లైన్ డేటింగ్ యాప్స్‌లను ఉపయోగించకూడదని అన్నారు. ఒకవేళ మీరు బాధితులు అయితే.. www.cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సైబరాబద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

Next Story

Most Viewed