పరోక్ష పన్నులను తొలగించండి: ఆర్‌బీఐ

by  |
పరోక్ష పన్నులను తొలగించండి: ఆర్‌బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగి సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్‌పై పరోక్ష పన్నులను తగ్గించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆర్థికవ్యవస్థలో ధరల ఒత్తిడిని తగ్గించేందుకు పన్నుల విషయంలో పట్టువిడుపులు ఉండాల్సిన అవసరం ఉందని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. ‘పెరుగుతున్న ముడిచమురు ధరల ద్రవ్యోల్బణ ప్రభావం, పెట్రోల్, డీజిల్‌పై అధికంగా పరోక్ష పన్నుల కారణంగా డిసెంబర్‌లో ఆహారం, ఇంధన ద్రవ్యోల్బణం మినహాయించి సీపీఐ ద్రవ్యోల్బణం 5.5 శాతానికి పెరిగింది.

అలాగే, కీలకమైన వస్తువులు, సేవల ద్రవ్యోల్బణం, ప్రధానంగా రవాణా, ఆరోగ్య విభాగంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని దాస్ పేర్కొన్నారు. కాగా, కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నులు పెట్రోల్, డీజిల్ ధరల్లో సగానిపైగా ఉన్నాయి. గత రెండు నెలల్లో ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడానికి కేంద్రం నిరాకరించింది. గతేడాది మార్చిలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి-మే మధ్య కాలంలో పెట్రోల్‌పై రూ. 13, డీజిల్‌పై రూ. 16 పెంచింది.



Next Story