తెలంగాణ ప్రభుత్వ పథకాల లిస్ట్, వాటి వివరాలు

by Disha Web Desk 17 |
తెలంగాణ ప్రభుత్వ పథకాల లిస్ట్, వాటి వివరాలు
X

దిశ, వెబ్‌డెస్క్:

* దళిత బంధు పథకం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 16, 2021 న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని శాలపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రూ.10 లక్షల రూపాయలు అందిస్తారు.


* కంటి వెలుగు: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు సార్వత్రిక కంటి పరీక్షలను నిర్వహించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనిని ఆగస్టు, 15, 2018 న ప్రారంభించారు.


* కేసీఆర్ కిట్: ప్రభుత్వ హస్పటల్‌లో జరిగే కాన్పులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ హస్పటల్‌లో పుట్టిన పిల్లలకు డైపర్లు, నాప్కిన్స్, టోయ్స్, దోమ తెరలు, బేబీ పౌడర్, బేబీ ఆయిల్, బేబీ సోపులు, పిల్లలకు కావాల్సిన బట్టలు తదితరాలను అందిస్తారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 జూన్ 2న లాంచ్ చేశారు. కాన్పులో ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, అబ్బాయి పుడితే రూ. 12 వేలు అందిస్తారు.


* ఆరోగ్య లక్ష్మి: ఈ పథకాన్ని జనవరి 1, 2015 న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకం ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు ప్రతిరోజూ ఒక పౌష్టికాహారాన్ని అందజేస్తోంది.


* కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్: SC/ST, బీసీ, మైనారిటీ కుటుంబాలలో అమ్మాయి పెళ్లి ఖర్చులకు ప్రభుత్వం రూ.1,00,116 ఆర్థిక సహాయాన్ని ఇస్తోంది. దీనిని 2014 అక్టోబర్ 2 ప్రారంభించారు.


* ఆసరా పింఛన్: దీన్ని 2014, నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు గ్రామంలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు నెలకు రూ. 3.016, వృద్ధులు, వితంతువులకు నెలకు రూ. 2.016 చొప్పున అందిస్తున్నారు.


* హరితహారం: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీనిని సీఎం కేసీఆర్ 2015, జులై 3న రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం చిలుకూరులో మొక్కలు నాటి ప్రారంభించారు. రెండో విడత హరితహారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో 2016, జులై 11న ప్రారంభించారు.

READ MORE

కరెంట్ అఫైర్స్: అంతర్జాతీయం

Next Story

Most Viewed