నల్లమలలో గంజాయి మొక్కల సాగు.. పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్

by  |

దిశ, అచ్చంపేట : నాగర్‎కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల పదర మండలంలో ఓ రైతు మిరప పంటలో అంతర్గతంగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో పదర ఎస్సై సురేష్ కుమార్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శుక్రవారం విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో మారడుగు ఆమ్లెట్ గ్రామమైన మోర్సు తండా దాడులు చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే దేశవత్ కిషన్ ( 55 ) అనే వ్యక్తి తన మిర్చి పంటలో గంజాయి సాగు చేస్తున్నాడని తెలిపారు. దాదాపుగా 70 గంజాయి మొక్కలను గుర్తించి.. స్వాధీనం చేసుకున్నామన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశామని తెలిపారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story