సాగు చట్టాలు అన్నదాతల సంకెళ్లను తెంచాయి: మోడీ

by  |
సాగు చట్టాలు అన్నదాతల సంకెళ్లను తెంచాయి: మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: తాము నూతనంగా తీసుకు వచ్చిన సాగు చట్టాలు అన్నదాతల సంకెళ్లను తెంచాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నూతన సంస్కరణలు వారికి కొత్త అవకాశాలను కల్పించాయని చెప్పారు. దీర్ఘకాలికంగా రైతులు చేస్తున్న డిమాండ్లను, వాటిని తీరుస్తామని చెప్పిన రాజకీయ పార్టీల హామీలన్నింటినీ పూర్తి చేసేలా కొత్తగా తీసుకు వచ్చిన సాగు చట్టాలు ఉన్నాయని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో కొత్త సాగు చట్టాలపై మోడీ మాట్లాడుతూ… పార్లమెంట్‌లో సాగు బిల్లులపై విస్తృతంగా చర్చ జరిపామనీ…ఆ తర్వాతే వాటిని ఆమోదించామని తెలిపారు.

ఇవి రైతులకు ఎదుర్కొంటున్న ఆంక్షలను తొలగించడమే కాకుండా.. కొత్త హక్కులు, అవకాశాలను కూడా కల్పించాయని చెప్పారు. మహారాష్ట్రలోని ధూలేకు చెందిన మొక్క జొన్న రైతు విషయాన్ని ప్రస్తావనకు తీసుకు వచ్చారు. జితేంద్ర భోజి మక్కలను పండించి విక్రయించారనీ… వర్తకులు అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకుండా ఆయనను తిప్పించుకున్నారని చెప్పారు. నూతన చట్టాలు వచ్చాకే స్వల్పకాలంలో రైతులు పంట డబ్బులను సులువుగా పొందగలిగారని తెలిపారు. పంట డబ్బులను మూడు రోజుల్లోగా చెల్లించాలని నూతన సాగు చట్టాలు ఆదేశిస్తున్నాయనీ..లేదంటే వారిపై కేసులు పెట్టేందుకు రైతులకు అవకాశాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు.



Next Story

Most Viewed