ధోనీ ఐపీఎల్ కెరీర్‌పై సీఎస్కే క్లారిటీ

50

దిశ, స్పోర్ట్స్ : ధోనీ రిటైర్మెంట్ అనేది ప్రతీసారి చర్చనీయాంశమే. గతంలో ధోనీ ఎప్పుడు రిటైర్ అవుతాడంటూ మీడియాలో కథనాలు వచ్చేది. అయితే గత ఐపీఎల్ సీజన్‌కు ముందు ధోనీ, రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఐపీఎల్ 13వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన అనంతరం ధోనీ లీగ్ నుంచి కూడా తప్పుకుంటాడనే వార్తలు వచ్చాయి. కానీ ధోనీ వాటికి గత సీజన్‌లోనే సమాధానం చెప్పాడు. తాజాగా ధోనీ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే ధోనీ చివరి లీగ్ అని పలు జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ‘ధోనీకి ఇది చివరి ఐపీఎల్ కాదు. ధోనీ కాకుండా ఆ బాధ్యతల్లో ప్రస్తుతానికి వేరే వాళ్లను ఊహించలేము. అతడు సీఎస్కేతో మరి కొంత కాలం ప్రయాణిస్తాడు’ అని విశ్వనాథన్ స్పష్టం చేశారు. జట్టులోని రవీంద్ర జడేజా, పుజార కూడా ధోనీ ఇప్పట్లో లీగ్ నుంచి నిష్క్రమించడని వారు అభిప్రాయపడ్డారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..