తొలిసారిగా ఆ దేవాలయానికి వెళ్లిన సీఎస్ దంపతులు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: బెజవాడ కనకదుర్గమ్మను ఏపీ సీఎస్ సమీర్‌శర్మ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబలు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎస్ దంపతులకు ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి అందజేశారు. మల్లేశ్వర స్వామివారిని కూడా సీఎస్ దంపతులు దర్శించుకున్నారు. సీఎస్‌గా నియమితులైనంక తొలిసారిగా సమీర్‌శర్మ [&hellip;]</p>

CS couple visits
X

దిశ, ఏపీ బ్యూరో: బెజవాడ కనకదుర్గమ్మను ఏపీ సీఎస్ సమీర్‌శర్మ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబలు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎస్ దంపతులకు ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి అందజేశారు. మల్లేశ్వర స్వామివారిని కూడా సీఎస్ దంపతులు దర్శించుకున్నారు. సీఎస్‌గా నియమితులైనంక తొలిసారిగా సమీర్‌శర్మ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Next Story