రాజధానికి అవసరమయ్యే భవనాలపై CS కమిటీ మీట్..

by  |
రాజధానికి అవసరమయ్యే భవనాలపై CS కమిటీ మీట్..
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజధానికి అవసరమైన అసంపూర్తి భవనాల నిర్మాణంపై శుక్రవారం ఏపీ సీఎస్ కమిటీ సమావేశమైంది. అంతకుముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తొలుత అసంపూర్తి భవన నిర్మాణ నిధుల అంచనాపై ఈ కమిటీ సమీక్షించింది.

ఏఎంఆర్‌డీఏ అధికారులు నివేదించిన వివరాల మేరకు రూ.2,154కోట్లు అవసరమవుతాయని కమిటీ ఓ అంచనాకు వచ్చింది. నిధుల సమీకరణ కోసం బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో భేటీ కావాలని ఏఎంఆర్డీఏకు సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ ఆదేశించింది. దీనిపై మార్చి రెండో వారంలో మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed