డీమాట్ ఖాతాతో కోటి రూపాయల మోసం

by  |
డీమాట్ ఖాతాతో కోటి రూపాయల మోసం
X

దిశ, క్రైమ్ బ్యూరో: డీమాట్ ఖాతాలోని కోటి రూపాయలను ఖాళీ చేసిన ఉధంతంపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. యూఎస్ఏకు చెందిన రామారావు నాగరాజు, అతని భార్య తార్నాకలోని కార్వీ స్టాక్ బ్రోకింగ్ బ్రాంచ్ కార్యాలయంలో కోటి రూపాయల విలువ చేసే డీమాట్ ఖాతాను కలిగి ఉన్నారు. ఈ ఖాతాను యాక్టివేషన్ చేసుకోవడం కోసం 2018 ఫిబ్రవరి నెలలో తార్నాక బ్రాంచ్‌ను సంప్రదించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మౌనిక, అసిస్టెంట్ మేనేజర్ వసుందరలు వారితో ఖాళీ కాగితంపై సంతకాలు చేయించుకున్నారు.

అయితే, ఈ డీమాట్ అకౌంట్ 2018 ఫిబ్రవరిలోనే యాక్టివేషన్ కాగా, వీళ్లకు తెలియకుండా బ్రాంచ్ మేనేజర్ మౌనిక, అసిస్టెంట్ మేనేజర్ వసుందరలు 2018 మే నుంచి 2019 ఫిబ్రవరి వరకూ బాధితులకు సంబంధించిన అకౌంట్ ద్వారా దాదాపు రూ.100 కోట్ల వరకూ పదే పదే ట్రేడింగ్ చేశారు. దీంతో బాధితులు రూ.1 కోటి రూపాయలు నష్టపోయినట్టు సెప్టెంబరు 25న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సీసీఎస్ పోలీసులు నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed