ఎడతెరిపి లేని వర్షం… పొంగుతున్న వాగులు

by Shyam |   (  Updated:2020-09-25 23:44:39  IST  )

<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరుపు లేకుండా వర్షం పడుతోంది. దీంతో జిల్లా అంతటా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే జిల్లాలో నీటి ప్రవాహం ధాటికి పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వర్షాల వల్ల చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా పలు చోట్ల ఇళ్ల గోడలు కూలిపోయాయి. వర్షం నీటి కారణంగా పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. [&hellip;]</p>

ఎడతెరిపి లేని వర్షం… పొంగుతున్న వాగులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరుపు లేకుండా వర్షం పడుతోంది. దీంతో జిల్లా అంతటా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే జిల్లాలో నీటి ప్రవాహం ధాటికి పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వర్షాల వల్ల చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా పలు చోట్ల ఇళ్ల గోడలు కూలిపోయాయి. వర్షం నీటి కారణంగా పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి.

ప్రాజెక్టుల పరిస్థితి….

ఎగువ వాగులు నుంచి వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి 5 షెటర్ల ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని ఊకచెట్టు వాగుకు విడుదల చేస్తున్నారు. అలాగే నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి భీమా ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించి 10 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 70వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 3.3 టీఎంసీలకు 2.6 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నారు. అదేవిధంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటి కారణంగా జూరాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 318.270 మిటర్లను నిల్వ ఉంచుతూ 9.152 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. ప్రస్తుతం జూరాలకు 1,11,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 13 గేట్లను ఎత్తి 1,26,358 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పొంగుతున్న వాగులు…

ఎడతెరుపు లేని వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం చిన్న వడ్డేమాన్ మన్నే వాగు వంతెనపై నీటి ఉధ్రితి తీవ్రంగా ఉండడంతో ఆత్మకూరు నుంచి మహబూబ్‌నగర్, హైదరాబాద్ రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే జిల్లాలోని దేవరకద్ర మండలం కౌకుంట్ల పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతుండడంతో వాగు రోడ్డు పైకి ఎక్కి పాడుతుండగా కౌకుంట్ల, ఇస్సరం పల్లి, గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడగా వెంకటాయపల్లి చెరువు అలుగు పరుతుండడంతో వెంకటాయపల్లి, గద్దెగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమలలోని రాత్రి నుంచి కురుతున్న వర్షానికి ముక్కిడిగుండం, నార్లాపూర్ దగ్గర ఉదృతంగా ప్రవహిస్తున్న పెద్ద వాగు, ఉడుముల వాగు పారుతుండదతో వాహనాల నిలిచిపోవడంతో పాటు ముక్కిడిగుండం, గేమ్యనాయక్ తాండ గ్రామాలు

గండీడ్ మండలంలోని రెడ్డి పల్లి మల్లయ్య చెరువు పొంగి పొర్లుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీ పార్కు నుంచి ఎనుగొండ సంతోష్ నగర్ కాలనీ మీదుగా పాల్కొండ పెద్ద చెరువులోకి వెళ్ళే ప్రధాన కాల్వనిండి చేక్ డ్యామ్‌ను తలపిస్తుంది. కల్వర్టు కూడా కుంగిపోవడంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

కూలిన ఇళ్ళు…

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కేటి దొడ్డి మండలం నందిన్నె గ్రామంలో మధ్య రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు దాదాపు నాలుగైదు ఇండ్లు పడిపోవడం జరిగింది. గతంలో కూడా ఈ గ్రామంలో వర్షం కారణంగా ఇల్లు కూలిపోవడం జరిగింది. ఇంతవరకు జిల్లాస్థాయి అధికారులు ఎవరూ ఆ గ్రామాన్ని సందర్శించిన లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఈ వర్షాల వల్ల పంట పొలాలు వరదలకు చాలా నష్టం వాటిల్లిందని, అధికారులు వెంటనే స్పందించి నందిని గ్రామాన్ని సందర్శించాలని ఆ గ్రామం నందిన్నె గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Next Story