- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సోనూ చేసిన సాయంపై వైసీపీ బురదజల్లుతోంది’
<p>దిశ ఏపీ బ్యూరో: వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమపై తప్పుడు ప్రచారం చేసి రోడ్డు పాలు చేయొద్దని రైతు నాగేశ్వరరావు చేతులెత్తి వేడుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారి వ్యవసాయం చేయించడంపై చలించిపోయిన సోనూసూద్ వాళ్లకు ట్రాక్టర్‌ను కొనిచ్చిన విషయం తెలిసిందే. రైతు నాగేశ్వరరావు కూతుళ్ల చదువు బాధ్యతల్ని తీసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇది గిట్టని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెంటనే దుష్ప్రచారానికి తెరలేపారని ఆయన వాపోయారు. రైతు నాగేశ్వరరావు నిజంగా […]</p>

దిశ ఏపీ బ్యూరో: వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమపై తప్పుడు ప్రచారం చేసి రోడ్డు పాలు చేయొద్దని రైతు నాగేశ్వరరావు చేతులెత్తి వేడుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారి వ్యవసాయం చేయించడంపై చలించిపోయిన సోనూసూద్ వాళ్లకు ట్రాక్టర్‌ను కొనిచ్చిన విషయం తెలిసిందే. రైతు నాగేశ్వరరావు కూతుళ్ల చదువు బాధ్యతల్ని తీసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు.
ఇది గిట్టని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెంటనే దుష్ప్రచారానికి తెరలేపారని ఆయన వాపోయారు. రైతు నాగేశ్వరరావు నిజంగా పేదవాడు కాదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మనస్థాపం చెందిన రైతు నాగేశ్వరరావు మీడియా ముందుకు వచ్చి, తన పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే మహల్రాజపురానికి రావాలని సూచించారు. తన కూతుళ్లను చంద్రబాబు చదివిస్తానని చెప్పడంతోనే తమపై బురదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని నాగేశ్వరరావు తెలిపారు. తన పేదరికాన్ని గుర్తించి ఎక్కడో ముంబైలో ఉన్న ఆ మహానుభావుడు ట్రాక్టర్‌ను గిఫ్ట్‌గా ఇస్తే ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు.






