- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Young man died: వేలంలో రూ.15 లక్షలతో లడ్డూ కైవసం.. అంతలోనే ప్రాణాలు విడిచిన యువకుడు
గణేష్ శోభాయాత్రలో పాల్గొన్న యువకుడు అంతలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విషాద ఘటన హైదరాబాద్‌లోని మణికొండలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: గణేష్ శోభాయాత్రలో పాల్గొన్న యువకుడు అంతలోనే గుండెపోటు(Heart Attack)తో ప్రాణాలు విడిచిన విషాద ఘటన హైదరాబాద్ (Hyderabad)లోని మణికొండ (Manikonda)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అల్కాపురి కాలనీలో ఆదివారం సాయంత్రం గణేష్ నిమజ్జనోత్సవాన్ని సంబురంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ (Shayam Prasad) లడ్డూ వేలంపాట (Laddu Auction)లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. పోటాపోటీగా జరిగిన వేలంలో అతడు రూ.15 లక్షలకు లడ్డూను కూడా కైవసం చేసుకున్నాడు. అనంతరం శోభాయత్ర సందర్భంగా స్వామి వారి లడ్డూ తనకే దక్కిందనే ఆనందంలో ఎంజాయ్ చేస్తూ డాన్స్ కూడా చేశాడు. ఇంతలోనే ఏదో పని మీద ఇంటి వెళ్లిన శ్యాంప్రసాద్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పటి వరకు ఆడుతూ.. పాడుతూ లడ్డూ వేలంలో పాల్గొన్న శ్యాంప్రసాద్ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల అల్కాపురి కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.






