అనారోగ్యం భరించలేక ఆత్మహత్య

by Sridhar Babu |

దోమ మండలం బొంపల్లి గ్రామంలో అనారోగ్య సమస్యలను భరించలేక పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

అనారోగ్యం భరించలేక ఆత్మహత్య
X

దిశ, దోమ : దోమ మండలం బొంపల్లి గ్రామంలో అనారోగ్య సమస్యలను భరించలేక పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దోమ ఎస్ఐ ఆనంద్ కుమార్, మృతురాలి కొడుకు మధు తెలిపిన వివరాల ప్రకారం.. వెన్నచెడు కమళమ్మ (47) దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఎంతకీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దాంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

Next Story