రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన దసరా పండుగ

by Bhoopathi Nagaiah |

దసరా పండగ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన దసరా పండుగ
X

దిశ, జన్నారం: దసరా పండగ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఒకే గ్రామంలో ఇద్దరు బాలికలు చనిపోవడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. బైక్‌పై వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం, పొనకల్‌ గ్రామానికి చెందిన పుప్పర్ల గంగన్న సోమవారం రాత్రి తన కూతురు రాహిత్య (15), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సాగర్ కూతురు సాత్విక (19)లను బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి వెళ్తుండగా.. వడ్డేపల్లి చెరువు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు బాలికలు వాహనంపై నుంచి ఎగిరి దూరంగా పడిపోయారు. ఈ ఘటనలో రాహిత్య అక్కడికక్కడే మృతి చెందగా.. సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

Next Story