Crime : చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

by Taduka Kalyani |   (  Updated:2024-09-08 13:32:07  IST  )

నారాయణపేట మండలం తిరుమలపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులను మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Crime : చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
X

దిశ, నారాయణపేట క్రైమ్: నారాయణపేట మండలం తిరుమలపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రీతి (13) రోహిత్ (11) ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారులు మంగళ, రాజమ్మ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తుంది. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటన వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా మృతులది కర్ణాటక రాష్ట్రం కాగ ఇటీవలనే వీరి కుటుంబ సభ్యులు తిరుమలపురం గ్రామంలో మృతిచెందగా అంత్యక్రియల కోసం వచ్చారు. ఇందులో భాగంగా బట్టలను ఉతికేందుకు సమీపంలోని చెరువు వద్దకు కుటుంబ సభ్యులు వెళ్ళగా వారి వెంట వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు.

Next Story