- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టపగలే దొంగల హల్‌చల్.. ఆగి ఉన్న కారు నుంచి 5 లక్షలు చోరీ (వీడియో)
పార్కింగ్ చేసిన కారులో నుంచి ఐదు లక్షలు కొట్టేసిన ఘటన కలకలం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టు పగలే దొంగలు రెచ్చిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్కింగ్ చేసిన కారులో నుంచి ఐదు లక్షలు కొట్టేసిన ఘటన కలకలం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టు పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు. అనంతరం తన మిత్రులతో కలిసి ఐదు లక్షల క్యాష్ కారులో పెట్టి భోజనం కోసం ఓ రెస్టారెంట్ ముందు వ్యాపారి కారు పార్కింగ్ చేశారు. వారిని అనుసరిస్తూ బైక్ మీద వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రెప్పపాటులో పర్కింగ్‌లో ఉన్న కారు అద్దాలు పగలగొట్టి ఐదు లక్షల క్యాష్ బ్యాగుతో పరారయ్యారు. బాధితుడు వెంటనే వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో తాజాగా వైరల్ అయ్యింది. ఇది తెలిసిన వాళ్ళపనే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






