- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబైలోని థానేలో దొంగల బీభత్సం.. రూ.21లక్షల కరెన్సీని తగులబెట్టిన దుండగులు
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలోని థానే జిల్లాలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈనెల 13న డోంబివాలి టౌన్‌షిప్‌లో సుమారు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఏటీఎంలోని డబ్బును దోచుకునేందుకు దుండగులు పక్కాగా ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఏటీఎం మిషన్‌ను తెరిచేందుకు ఓ గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించారు. ప్రమాదవశాత్తు ఆ మంటలు కాస్త ఏటీఎం మిషన్‌లోని కరెన్సీకి అంటుకోగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు విషయాన్ని పసిగట్టడంతో దుండుగులు అక్కడి నుంచి ఉడాయించారు. ఘటనా స్థలానికి చేరకున్న బ్యాంక్ అధికారులు ఘటన జరిగిన సమమంలో ఏటీఎం మిషన్‌లో దాదాపు రూ.21,11,800 నగదు ఉండొచ్చిన అంచనా వేస్తున్నారు.
Next Story






