- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు మృత్యువాత
by Sridhar Babu |
ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని శ్రీరామగిరి గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, ఏన్కూరు : ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని శ్రీరామగిరి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాదావత్ రవి తెలిపిన వివరాల ప్రకారం శ్రీ రామగిరి గ్రామానికి చెందిన దుగ్గినేని రామారావు బుధవారం సాయంత్రం తన పత్తి చేను, వరి పొలంకు నీళ్లు పెట్టేందుకు కరెంట్ మోటార్ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ వైరు కాలుకి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రవి కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.
- Tags
- Current shock
Next Story






