- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లో అమ్మాయిల నగ్న వీడియోలు తీయబడును..? కలకలం రేపుతోన్న ‘స్నానం గది’ పిక్చర్స్
ఎక్కడికి వెళ్లినా కామాంధులు పొంచి ఉంటూనే ఉన్నారు. గుడి, బడి, కాలేజీ, షాపింగ్ మాల్.. ఇలా ఏదైనా కీచకులు తిష్టవేసుకుని కూర్చుంటున్నారు. తాజాగా ఓ యువతి ఫిట్ నెస్ సెంటర్లో స్నానం చేస్తుండగా.. జిమ్ కోచ్ తన పాడు బుద్ధిని బయటపెట్టాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఎక్కడికి వెళ్లినా కామాంధులు పొంచి ఉంటూనే ఉన్నారు. గుడి, బడి, కాలేజీ, షాపింగ్ మాల్.. ఇలా ఏదైనా కీచకులు తిష్టవేసుకుని కూర్చుంటున్నారు. తాజాగా ఓ యువతి ఫిట్ నెస్ సెంటర్లో స్నానం చేస్తుండగా.. జిమ్ కోచ్ తన పాడు బుద్ధిని బయటపెట్టాడు. నగ్నంగా స్నానం చేస్తున్న ఆమె వీడియోలు రికార్డు చేశాడు. బెంగళూర్‌లో బయటపడ్డ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాణసవాడిలోని ఎన్ఆర్ఐ లే అవుట్ వద్ద ఓ ఫిట్ నెస్ సెంటర్ నడుస్తోంది. ఒకే దగ్గర జిమ్, స్విమ్మింగ్ ఉండటంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఓ యువతి రెండు నెలల నుంచి శిక్షణ తీసుకుంటుంది. రెండు రోజుల క్రితం వర్కౌట్స్ పూర్తయ్యాక ఆమె స్నానం చేసేందుకు బాత్ రూంకు వెళ్లింది. దాంట్లోకి వెళ్లి బట్టలు విప్పేయగానే జిమ్ కోచ్ ఆమె స్నానం చేస్తున్న వీడియోను సీక్రెట్‌గా రికార్డు చేయడం ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన యువతి వెంటనే గట్టిగా కేకలు వేసింది. దీంతో కోచ్ అక్కడి నుంచి పరారయ్యాడు.
యువతి వెంటనే బయటకు వచ్చి ఫిట్ నెస్ సెంటర్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలను పరిశీలించిన ఆయన వీడియో తీసింది HS సిబియాచన్ అనే కోచ్ అని గుర్తించారు. వెంటనే కోచ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన బయటపడటంతో ఫిట్‌నెస్ సెంటర్‌కు వచ్చే యువతులంతా షాక్‌కు గురయ్యారు. కోచ్ మొబైల్స్ పరిశీలించగా.. పలువురి యువతులు, మహిళల నగ్న వీడియోలు, ఫొటోలు బయటపడ్డాయి. వాటిన్నీటిని డిలీట్ చేసిన పోలీసులు HS సిబియాచన్‌తోపాటు ఫిట్ నెస్ సెంటర్‌పైన కేసు బుక్ చేశారు.






