- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై లైంగిక దాడి.. నిందితుని అరెస్ట్..
by Batti.Sumithra |
బాలికపై లైంగిక దాడి చేసిన నిందితుడిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

X
దిశ, మేడిపల్లి : బాలికపై లైంగిక దాడి చేసిన నిందితుడిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ గోవింద రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ లో నివసించే బాలిక (15) తన ఇంటి సమీపంలో తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. అదే సమయంలో నిందితుడు కేశవ రెడ్డి (36) తన సెల్ ఫోన్ లో ఇద్దరిని వీడియో, ఫొటోస్ తీసి బాలిక కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరించాడు. అంతే కాదు బాలికను తన రూమ్ కి తీసుకువెళ్లి లింగికంగా వేధింపులకు పాల్పడినాడు. బాలిక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బుధవారం నిందితున్ని అరెస్ట్ చేసి ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామని తెలియజేశారు.
Next Story






