లేడీ టీచర్ పిలిచిందని వెళ్లి.. క్లాస్ రూంలోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఉపాధ్యాయులు.. ఐదుగురికి గాయాలు (వీడియో)

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-11-23 14:01:41  IST  )

చిన్న వివాదం కారణంగా ఇద్దరు ఉపాధ్యాయులు క్లాస్ రూంలోనే విద్యార్థుల ఎదుట పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు.

లేడీ టీచర్ పిలిచిందని వెళ్లి.. క్లాస్ రూంలోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఉపాధ్యాయులు.. ఐదుగురికి గాయాలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : చిన్న వివాదం కారణంగా ఇద్దరు ఉపాధ్యాయులు క్లాస్ రూంలోనే విద్యార్థుల ఎదుట పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఒకరి చొక్కాని మరొకరి చించుకున్నారు. ఎవరు అడ్డుకున్నా.. ఆగకుండా పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ దృశ్యాలను చూసిన విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన వారం రోజుల క్రితం కేరళలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చి వైరల్‌గా మారింది.

ఎరవన్నూరులోని ఏయూపీ స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. అయితే ఆ స్కూళో పని చేస్తున్న ఓ మహిళా టీచర్.. మరో పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడైన తన భర్త ఎంపీ షాజీని ఆహ్వానించింది. ఆ సమయంలో ఓ విద్యార్థి ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదును ఎంపీ షాజీ చైల్డ్‌లైన్‌కు పంపించి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు.. మీ భర్త అలా ఎలా ఫిర్యాదు చేస్తాడని ఆ మహిళా టీచర్‌ను నిలదీశారు. ఇదే సమయంలో భార్యను తీసుకెళ్లడానికి వచ్చిన ఎంపీ షాజీను సైతం ప్రశ్నించారు. దీంతో టీచర్ దంపతులు, ఉపాధ్యాయుల మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది.

ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఉపాధ్యాయులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చొక్కలు చింపేసి కొట్టుకున్నారు. మహిళా టీచర్లు, ఉపాధ్యాయులు అడ్డుకున్న ఇద్దరు ఘర్షణ పడ్డారు. అయితే ఇదంతా క్లాస్ రూంలోనే జరగడం గమనార్హం. ఉపాధ్యాయులు ఘర్షణలో భయాందోళన చెందిన విద్యార్థులు తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఎంట్రీ ఇచ్చి ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. ఘర్షణ పడిన వారిపై ఐపీసీ 332, 506, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ గొడవలో ఐదుగురు ఉపాధ్యాయులు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story