గణేశ్ నిమజ్జనంలో పంజా విసిరిన షీ టీమ్స్

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-09-29 14:21:01  IST  )

గణేశ్ ఉత్సవాల్లో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలపై షీ టీమ్స్ పంజా విసిరాయి.

గణేశ్ నిమజ్జనంలో పంజా విసిరిన షీ టీమ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గణేశ్ ఉత్సవాల్లో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలపై షీ టీమ్స్ పంజా విసిరాయి. ర్యాలీల్లో అడుగడుగునా నిఘావేసి 250 మందికి పైగా ఆకతాయిలపై షీ టీమ్స్ బృందాలు కేసులు నమోదు చేశాయి. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా వివరాలను వెల్లడించారు. మహిళల పట్ల రద్దీ ప్రాంతాల్లో అసభ్యంగా ప్రవర్తించడం, శోభాయాత్రలో లిక్కర్ తాగి వెహికిల్స్‌పై రావడం, అసభ్యకరమైన పాటలు పెట్టి డ్యాన్స్‌లు చేయడం సరికాదనన్నారు. ఈవీటీజింగ్‌కు పాల్పడుతున్న 250 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ సారి భారీగా విగ్రహలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యం అయిందన్నారు. అక్టోబర్ 1వ తేదీన జరగబోయే ‘మిలాద్ ఉన్ నబీ’ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగిందని, ఎప్పుడు లేని విధంగా ఖైరతాబాద్ గణేష్‌ను ముందుగా నిమజ్జనం చేశామని తెలిపారు.

Next Story