- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
by Chintha Aamani |
అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గాయత్రి నగర్ కాలనీలోని ఓ ప్లాట్‌లో

X
దిశ,కూకట్పల్లి : అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గాయత్రి నగర్ కాలనీలోని ఓ ప్లాట్‌లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అల్లాపూర్ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అల్లాపూర్ గాయత్రి నగర్లో ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఇద్దరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ప్లాట్‌పై దాడి చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్న వంశీకృష్ణ(29),ఓ మహిళ, విటుడు మహంకాళి సాయి కిరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్లను, రూ.6280 నగదు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Next Story






