- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
crime news : జ్వరం బారిన పడి ఎల్కేజీ బాలుడు మృతి..
తిరుమలాయపాలెం గ్రామంలో విషాదం జరిగింది. ఒక్కరోజు జ్వరం వచ్చి ఎల్కేజీ చదువుకుంటున్న ఓ బాలుడు మృతి చెందాడు.

దిశ, తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం గ్రామంలో విషాదం జరిగింది. ఒక్కరోజు జ్వరం వచ్చి ఎల్కేజీ చదువుకుంటున్న ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని గొలుసు ఉమేశ్ అనే బైక్ మెకానిక్ కొడుకు అక్షిత్ (6) ఎల్కేజీ చదువుకుంటున్నాడు. సోమవారం ఉదయం దాకా ఆడుకున్న బాలుడు ఒక్కసారిగా జ్వరం బారిన పడటంతో ఫిట్స్ వచ్చాయి.
వెంటనే తల్లిదండ్రులు ఖమ్మంలోని రెండు ప్రయివేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. బాబు ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నదని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి బాలుడు చనిపోయాడని తెలిపారు. ఐదు రోజుల క్రితమే బాలుడికి ఐదో సంవత్సరం బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. అల్లారుముద్దుగా ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా జ్వరనికి గురై మృతి చెందగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






