HYD: వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం

by Disha Web Desk 2 |
HYD: వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ వనస్థలిపురం: హైదరాబాద్‌ వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా షాప్‌ మొత్తానికి మంటలు విస్తరించడంతో అగ్ని కనికలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. షాపులో సుమారు రూ.15 లక్షల వరకు షాప్ యజమాని చెప్పాడు.

Next Story

Most Viewed