- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, తూప్రాన్ : మహిళ బ్యాగు నుండి ఐదు తులాల బంగారం చోరీ అయింది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డి గూడెం కి చెందిన మహిళ బంధువుల పెళ్లి ఉందని ఆమె వదినకు నాలుగు తులాల లాంగ్ చైన్, ఒక తులం బంగారం మొత్తం ఐదు తులాలు ఈ నెల 20వ తేదీన ఇచ్చానని తెలిపారు.
అవి తిరిగి తీసుకొని గురువారం శివంపేట్ మండలం ఉషిరికపల్లె గ్రామ బస్ స్టాండ్ లో సాయంత్రం గజ్వేల్ బస్ ఎక్కింది. తూప్రాన్ లో దిగి కాసేపటికి రామయంపేట్ నుండి సికింద్రాబాద్ వెళ్లే బస్ ఎక్కి కూర్చుని బ్యాగు చూసుకోగా అందులో ఉన్న లాంగ్ చైన్, కమ్మలు కనబడకపోవడంతో చుట్టూ పక్కల వెతికింది. అయినా ఫలితం లేకపోవడంతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
- Tags
- gold stolen
Next Story






