- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: హిమాయత్ నగర్లో అగ్ని ప్రమాదం
by GSrikanth |
హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలుగు అకాడమీకి ఎదురుగా ఉన్న తిరుమల ఎస్టేట్లోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలుగు అకాడమీకి ఎదురుగా ఉన్న తిరుమల ఎస్టేట్లోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకోవడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మరోవైపు చుట్టుపక్కల ఉండే బిల్డింగ్ వారు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
Next Story






