- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడు నెలల గర్భవతి మృతి
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని 44వ జాతీయ

X
దిశ,మనోహరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఈ ఏడు నెలల గర్భవతి తో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు రోడ్డు పాలయింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మిరుదొడ్డి మండలానికి చెందిన భార్యాభర్తలు మనోహరాబాద్ నుండి దండుపల్లి కి బైక్ పై వెళుతున్న తరుణంలో జాతీయ రహదారి రోడ్డు క్రాస్ చేస్తుండగా తూప్రాన్ నుండి అతివేగం గా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో భార్యాభర్తలు వెళ్తున్న బైకు కిందపడిపోయింది. మహిళ గర్భవతి కావడంతో మహిళ మృతిచెందగా ఆమె కడుపులో ఉన్న ఏడు నెలల శిశువు కడుపు నుండి బయటకు వచ్చి రోడ్డుపై పడిపోయింది. ఈ సంఘటన చూసినవారు కంటతడి పెట్టారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






